Header Banner

ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం! 100% రాయితీతో...!

  Tue Feb 18, 2025 17:26        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నలకు మేలు చేసే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100% రాయితీ మీద సూక్ష్మ సేద్య పరికరాలు అందించడానికి నిర్ణయించింది. రైతులకు రాయితీపై 2.18 లక్షల రూపాయల వ్యవసాయ పరికరాలు రాష్ట్రంలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు 2.18 లక్షల రూపాయలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యవసాయ సహకార శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఈ పథకానికి సంబంధించిన రాయితీకి సంబంధించి వివరాలను వెల్లడించారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


2025 2026 సంవత్సరంలో రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సబ్సిడీ వివరాలను తెలియజేశారు. వారికి 100% డ్రిప్ పరికరాలపై రాయితీ ఎస్సీ, ఎస్టీలలో చిన్న, మధ్యతరహా రైతులకు ఐదు ఎకరాల వరకు 100% డ్రిప్ పరికరాలను రాయితీగా ఇస్తున్నట్టు తెలిపారు. ఇక మిగిలిన చిన్న, మద్యస్థ రైతులకు 90 శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఐటీడీఏ పరిధిలో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, కోస్తా జిల్లాలలో ఐదు నుండి పది ఎకరాల మధ్యస్థ రైతులకు 70 శాతం ఇవ్వనున్నారు. సబ్సిడీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇక రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, పెద్ద రైతులకు 50% సబ్సిడీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇక స్ప్రింక్లర్లపై అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు ఇక ఈ సబ్సిడీ లో 27% నుంచి 33% కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా 17% నుంచి 67% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన ఉత్తర్వులలో పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


రైతు సేవా కేంద్రాల వద్ద పూర్తి సమాచారం రైతు సేవ కేంద్రాల వద్ద రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో భాగంగా ఇస్తున్న సూక్ష్మ సేద్య పరికరాల సబ్సిడీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే 2022లో వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రకటించిన ఈ పథకాన్ని 2022- 2023, 2023 -2024 సంవత్సరాలలో నామమాత్రంగా అమలు చేశారు. ఈ పథకం అమలు చేయకుండా 1150 కోట్ల మీద బకాయిలు పెట్టారనే విమర్శలు కూడా వైసిపి ప్రభుత్వం పై ఉన్నాయి. కాగా ఈ పథకాన్ని ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేసే దిశగా అందిస్తోంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #formers #goodnews #NDA #governament #todaynews #flashnews #latestupdate